News October 27, 2025
ఆదిలాబాద్: KU.. ఫీజు చెల్లింపుకు నేడే ఆఖరు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండగా దానికి ఈనెల 27వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున ఫీజు చెల్లించని విద్యార్థులు గమనించి నేడు ఫీజు చెల్లించాలని సూచించారు.
Similar News
News October 27, 2025
నాగార్జున సాగర్.. CCTVల ఏర్పాటుకు అనుమతి

నాగార్జున సాగర్ జలాశయం కుడి వైపు(AP) CCTVల ఏర్పాటుకు TG ప్రభుత్వానికి KRMB అనుమతి ఇచ్చింది. డ్యామ్ పర్యవేక్షణకు AP భూభాగంలో CCTVల ఏర్పాటుకు TG నీటిపారుదల అధికారులు ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు సాగర్ కుడివైపు రిజర్వాయర్ నిర్వహణకూ ఏపీ అనుమతి ఇవ్వడం లేదనే ఫిర్యాదుపై KRMB స్పందించింది. 2014లో విభజన చట్టం తర్వాత, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుంటోంది.
News October 27, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
News October 27, 2025
‘మొంథా’ తుఫాను.. అగ్నిమాపక బృందాలు సిద్ధం

‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్ జాకెట్లు, 40 లైఫ్ బాయ్స్, 30 రోప్‌లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా తుఫాన్ సమయంలో పడిపోయే చెట్లను తొలగించడానికి 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.


