News June 5, 2024
ఆదిలాబాద్: MP ఫలితం.. 20 ఏళ్ల చరిత్ర తిరగరాసింది

20 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ఓటర్లు ఏ పార్టీకి రెండు సార్లు వరుసగా విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీదే కావడం.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి 20ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇదే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత BJPలో చేరిన సోయం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గొడం నగేశ్ సైతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి MPగా పోటీలో నిలిచారు. అలాగే పార్టీలో చేరిన వెంటనే గెలిచిన అభ్యర్థిగా నగేశ్ నిలిచారు.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.


