News June 25, 2024
ఆదిలాబాద్: PM విశ్వకర్మ యోజన పథకానికి 6061 దరఖాస్తులు

PM విశ్వకర్మ యోజనపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ విశ్వకర్మ యోజన గురించి వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6061 దరఖాస్తులు చేసుకున్నారని అందులో 1820 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. కాగా మిగతా 4241 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 3, 2025
జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.
News November 2, 2025
ADB: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి: సలోని చాబ్రా

వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని ట్రైనీ కలెక్టర్‌సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పర్యవేక్షణతో ఉండి వారికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు.
News November 1, 2025
ADB: జాతీయ గౌరవ దివాస్‌లో పాల్గొన్న ఎంపీ నగేశ్

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు బీర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు.


