News April 8, 2025
ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏడాది పన్ను అంతా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చని GVMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధీర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ నెలలో ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
గాజువాక యువకుడిని కాపాడిన పోలీసులు

గాజువాకకు చెందిన సన్యాసినాయుడు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసినాయుడు రాజమండ్రిలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నాడు. కాగా బెట్టింగులకు బానిసై రూ.50వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. అది గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని కాపాడారు.
News April 17, 2025
విశాఖలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్

విశాఖలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగటి పూటే ఇంట్లోకి చొరబడి దొచుకుంటున్నారు. మద్దిలపాలెంలో మంగళవారం సాయంత్రం అద్దె ఇంటికోసం అని వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన మర్చిపోకముందే MVP కాలనీలో బుధవారం సాయంత్రం మరో ఘటన జరిగింది. MVP సెక్టార్-8లో లలిత అనే వృద్ధురాలి మెడలో గొలుసు తెంపుకొని ఓ దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 17, 2025
విశాఖ: సమతా ఎక్స్ ప్రెస్ రద్దు

నాగపూర్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ- నిజాముద్దిన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807/12808) ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.