News August 30, 2025
ఆదివారం కూడా బిల్లులు చెల్లించేందుకు అవకాశం: ఎస్ఈ

విశాఖ జిల్లాలో ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు 31వ తేదీన ఆదివారం కూడా పనిచేస్తాయని పర్యవేక్షక ఇంజనీర్ శ్యాంబాబు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవిన్యూ కార్యాలయాలు, ఉపవిద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, రాజీవ్ ఈపీడీసీఎల్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో చెల్లించవచ్చన్నారు. ఈపీడీసీఎల్ వెబ్ సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని అన్నారు.
Similar News
News August 30, 2025
విశాఖ: మీకు ఎస్ఎంఎస్ వచ్చిందా?

రైట్ టు ఎడ్యుకేషన్ (R.T.E.) చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసానికి లాటరీ ద్వారా 1784 మంది విద్యార్థులను ఎంపిక చేసామని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఈ విద్యార్థులు ఆగస్టు 30లోపు కుల, ఆదాయ, పుట్టిన, ఆధార్, దివ్యాంగ ధ్రువపత్రాలు సమర్పించి పాఠశాలల్లో చేరాలన్నారు. లేకపోతే అడ్మిషన్లు పెద్ద అవుతాయన్నారు. తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామన్నారు.
News August 29, 2025
క్రీడాకారులకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా: మంత్రి లోకేశ్

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఇవ్వనున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖీలో మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడల్లో బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌ల కొరత ఉందన్నారు. 43 వేల పాఠశాలలు ఉన్నా తగినంతమంది పీఈటీలు లేరన్నారు.
News August 29, 2025
పిల్లలను యూట్యూబ్, పబ్జిలకు దూరంగా ఉంచాలి: లోకేశ్

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతిని సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశాల్లో క్రీడల అభివృద్ధిపై చర్చిస్తున్నామన్నారు. పిల్లలను యూట్యూబ్, పబ్జీలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు.