News January 25, 2026

ఆదివారం రోజున ఈ పనులు చేస్తున్నారా?

image

ఆదివారం, సప్తమి రోజుల్లో కొన్ని పనులు చేస్తే సూర్య దోషం కలగవచ్చని పండితులు చెబుతున్నారు. ‘మద్యమాంసాలు ముట్టకూడదు. క్షురకర్మ చేసుకోకూడదు. తలస్నానానికి నూనె వాడకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అశుభం. తోలు వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. సూర్యాస్తమయానికి ముందే తినేయాలి. ఆ తర్వాత చేసే భోజనం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఈ నియమాలు అతిక్రమిస్తే దారిద్ర్యం, అనారోగ్యం, కంటి సమస్యలు వచ్చే అవకాశముంది’ అంటున్నారు.

Similar News

News February 24, 2026

ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలి? (1/2)

image

మేష రాశి : ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః
వృషభ రాశి : ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః
మిథున రాశి : ఓం క్లీం కృష్ణాయ నమః
కర్కాటక రాశి : ఓం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపిణే నమః
సింహ రాశి : ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః
కన్యా రాశి : ఓం హ్రీం పీతాంబరాయ నమః

News February 24, 2026

అలాంటి పత్తి విత్తనాలను కొనొద్దు

image

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్తి విత్తనాలు ఫీల్డ్ ట్రయల్స్‌లో విఫలమయ్యాయి. పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఈ పత్తి విత్తనాలను సాగు చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

News February 24, 2026

APPLY NOW: HALలో 151 పోస్టులు..

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో 151 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్+ఐటీఐ+NAC, ఇంటర్+ఎక్స్ సర్వీస్‌మెన్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.21,000-రూ.23,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, DV, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://hal-india.co.in