News August 9, 2025
ఆదివాసీలకు అండగా ఉంటాం: మంత్రి కొండపల్లి

ఆదివాసీలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధి కోసం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామన్నారు. జిల్లా విడిపోయిన తర్వాత ITDA వేరయ్యిందని, అందువలన గిరిజనులకు అందవలసిన సౌకర్యాలను కోల్పోయారన్నారు.
Similar News
News August 10, 2025
పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుపడుతన్నారు: మంత్రి

పరిశ్రమల స్థాపన కోసం సీఎం చంద్రబాబు పాటుపడుతుంటే, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాకు రావొద్దని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం జిల్లా తెలుగదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేస్తామంటే టీడీపీ ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు తేలేకపోయారని విమర్శించారు.
News August 10, 2025
VZM: కేజీ చికెన్ రూ.150

ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే. సండే రోజు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతోంది. చికెన్ (స్కిన్) రూ.150, (స్కిన్ లెస్) రూ.170, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
News August 9, 2025
విజయనగరంలో ఈనెల 12న మెగా జాబ్ మేళా

విజయనగరంలోని SSSS డిగ్రీ కాలేజీలో ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులుగా పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.