News March 5, 2025

ఆదోనికి ‘పోసాని’.. కేసు ఇదే!

image

గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని <<15649438>>ఆదోని<<>> పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన నేత రేణువర్మ ఫిర్యాదు మేరకు పోసానిపై గతేడాది ఆదోని త్రీ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో పీటీ వారంట్‌పై పోసానిని ఆదోనికి తరలించారు.

Similar News

News March 5, 2025

జగన్.. జైల్‌కు తక్కువ, బెయిల్‌కు ఎక్కువ: శబరి

image

‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ. ఎమ్మెల్యేకు తక్కువ. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు’ అంటూ మాజీ సీఎం <<15658870>>జగన్<<>> చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా జగన్ వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చారు. ‘ఈయన గారు జైల్‌కు తక్కువ, బెయిల్‌కు ఎక్కువ’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ కామెంట్స్‌పై కూటమి నేతలు మండిపడుతున్నారు.

News March 5, 2025

అధికారులకు కర్నూలు కలెక్టర్ సూచనలు 

image

మహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవ నిర్వహణపై అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా రంగాల్లో విజయాలు సాధించిన మహిళలను ఆహ్వానించి సన్మానం చేయాలని చెప్పారు. ముందుగా అమరావతి నుంచి ఇదే అంశంపై కలెక్టర్‌తో మంత్రి సమీక్ష చేశారు.  

News March 5, 2025

కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

image

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.

error: Content is protected !!