News April 17, 2025
ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షల నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటి వరకు 10,620 లీటర్ల డీజిల్ దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ అపరేషన్‌ను ఆదోని SDPO హేమలత పర్యవేక్షణలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీరాం విజయవంతంగా నిర్వహించారు.
Similar News
News April 19, 2025
తిరుమల: దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 58,519 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం సమకూరింది.
News April 19, 2025
రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.
News April 19, 2025
కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.