News March 18, 2024
ఆదోనిలో అంతర్రాష్ట్ర సెపక్ తక్రా పోటీలు

రాయలసీమ వర్శిటీ, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలు సోమవారం ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో రెండో రోజు కొనసాగాయి. రెండో రోజు Apj Abdul Kalam యూనివర్సిటీపై MJPR బరేలి యూనివర్సిటీ, శ్రీ కుషల్ దాస్ యూనివర్సిటీపై అన్నా విశ్వవిద్యాలయం, మాధవ్ యూనివర్సిటీపై ఉస్మానియా యూనివర్సిటీ, గొందావాన్ యూనివర్సిటీపై రాయలసీమ యూనివర్సిటీ జట్లు విజయం సాధించాయి.
Similar News
News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 3, 2025
కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులపై చర్చ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని భరత్ తెలిపారు.