News November 24, 2024
ఆదోనిలో ఆటో బోల్తా పడి మహిళ మృతి
ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్లారికి చెందిన మహంకాళమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తారపురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2024
కర్నూలు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు
కర్నూలు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 -.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి
News November 24, 2024
నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ
నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.