News January 8, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,500

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,500 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 3,131 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,509, సరాసరి రూ.7,209, కనిష్ఠ ధర రూ.5,080తో అమ్మకాలు జరిగాయి.

Similar News

News January 9, 2025

స్వయం ఉపాధి రుణాల మంజూరుకు దరఖాస్తుల ఆహ్వానం

image

నంద్యాల జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి బ్యాంకర్లను సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాల మంజూరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. అర్హత గల వ్యక్తులకే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

News January 8, 2025

20న దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు

image

ఈనెల 20న కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఆయన బుధవారం వికలాంగుల సంక్షేమ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.

News January 8, 2025

కర్నూలు: పెళ్లయిన 21 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

పెళ్లయిన 21 రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. కర్నూలుకు చెందిన రాకేశ్ గౌడ్(34)కు కొన్ని రోజుల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకొని అరుణ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.