News May 25, 2024
ఆదోనిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శెట్టి బలిజ హరిప్రసాద్(30)గా గుర్తించామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Similar News
News February 25, 2026
ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News February 25, 2026
ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News February 24, 2026
కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 297 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 297 మంది విద్యార్థులు హాజరు కాలేదని రీజనల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాలప్ప తెలిపారు. మొత్తం 21,147 మంది విద్యార్థులకు గానూ 21,174 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.


