News August 15, 2024

ఆదోని: మేము అధికార పార్టీలో ఉన్నామా..?: మీనాక్షి నాయుడు

image

కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఆదోనిలో బీజేపీ అభ్యర్థి కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపించుకున్నామని, అయినా తాము అధికార పార్టీలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి వల్ల తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ నాయకులను ఇబ్బంది పెట్టిన వారిని బీజేపీలో చేర్చుకోవడం ఏంటని అసహనం వ్యక్తంచేశారు.

Similar News

News January 21, 2025

కర్నూలు జిల్లా కొత్త ఎస్పీ నేపథ్యం ఇదే!

image

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా <<15208705>>ఐపీఎస్<<>> అధికారి విక్రాంత్ పాటిల్ నియమితులైన విషయం తెలిసిందే. విక్రాంత్ గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీ, విజయవాడ డీసీపీ, చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్‌, మన్యం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్నారు. ఆయన సతీమణి దీపికా పాటిల్ కూడా ఐపీఎస్ అధికారే. గతంలో కర్నూలు ఏఎస్పీగా సేవలందించారు.

News January 21, 2025

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి: నంద్యాల కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అధికారి తన లాగిన్‌లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 20, 2025

కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

image

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.