News December 12, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరలు ఇలా!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటాళ్లలో.. పత్తి కనిష్ఠ ధర రూ.4,161, గరిష్ఠ రూ.7,679 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,679, గరిష్ఠ ధర రూ.6,540 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,693, గరిష్ఠంగా రూ.6,084 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 13, 2025

అన్నమయ్య: 7th విద్యార్థికి స్క్రబ్ టైఫస్ వ్యాధి

image

అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ SC వసతి గృహంలో ఉంటున్న అతడికి గతనెల 28న జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో అక్కడే చికిత్స అందించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 9న తిరుపతి రుయా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

News December 13, 2025

KMR: రెండవ విడత 1,89,177 ఓటర్లు

image

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో రేపు రెండవ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 1,89,177 మంది ఓటర్లుండగా, మహిళలు 98,435, పురుషులు 90739, ఇతరులు 3 ఉన్నారు. 1655 పోలింగ్ కేంద్రాల్లో 153 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. 197 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 44 సర్పంచ్, 775 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

News December 13, 2025

GNT: ఇం’గలీస్’ టీచర్.. 8వ తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసి..

image

పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పెడదారి పట్టాడు. 45 ఏళ్ళ వయస్సులో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని లోబర్చుకున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన కార్తీక్ పేరేచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత బాలిక మేడికొండూరు PSకి వెళ్ళి సార్‌ తనను పెళ్ళి చేసుకున్నారని.. ఆయతోనే ఉంటానని అనడంతో పంచాయితీ జరుగుతోంది.