News March 23, 2024

ఆదోని సబ్ కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

image

అదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన పింజరి కాశీం అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నెల 26వ ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణశర్మ వాహనాన్ని కాశీం బైక్ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Similar News

News February 18, 2026

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.

News February 18, 2026

కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

image

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.