News July 14, 2024
ఆధారాలు లేకుండా జగన్పై అక్రమ కేసు పెట్టడం సరికాదు: రెడ్యం

మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అక్రమ కేసు పెట్టడం సరికాదని వైసీపీ నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని తన కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణమరాజుపై పోలీసుల దాడి వాస్తవం కాదని వైద్యపరీక్షల నివేదిక నిగ్గు తేల్చినా అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు.
Similar News
News December 25, 2025
మైదుకూరులో గుండెపోటుతో యువ వైద్యుడు మృతి

మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డుకు చెందిన యువ వైద్యుడు శశికాంత్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతి చెందడం పట్ల మైదుకూరు పట్టణ వాసులు, పరిసర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఈయన తండ్రి డాక్టర్ రంగ సింహ ఇటీవలే వయో భారం కారణంగా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వైద్యులు మృతి చెందడంతో పట్టణవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈయన ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు.
News December 25, 2025
క్యాలెండర్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 25, 2025
జగన్కు ముద్దు పెట్టిన విజయమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.


