News April 3, 2024
ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?
Similar News
News October 2, 2025
3వ తేదీ నుంచి జిల్లాలో రీ సర్వే గ్రామాల జాబితా విడుదల

ఈనెల 3వ తేదీ నుంచి జిల్లాలో 34 గ్రామాలలో రీ సర్వే నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భూములు కలిగిన అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూముల హద్దులు రీ సర్వే టీంకు చూపించి రికార్డులలో తమ పేరు నమోదు చేసుకొని రీ సర్వే నిర్వహించు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
News October 1, 2025
నెల్లూరు: జోరందుకున్న మద్యం అమ్మకాలు

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. దసరా రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దసరా పండగ అంటే మందు బాబులకు విందే. కానీ ఈసారి అది కుదరడం లేదు. దీంతో మందుబాబులు, బెల్టు షాపులు వారు ముందురోజే మద్యాన్ని భారీగా డంపు చేస్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 180 కి పైగా వైన్, 26కు పైగా బార్లు మూతపడనున్నాయి. మరోవైపు చికెన్ దుకాణాలు రాత్రి సమయం, వేకువజామునే అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
News October 1, 2025
ఉదయగిరి: డిప్యూటీ కలెక్టర్ దంపతులకు తప్పిన ప్రమాదం

ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్( రేరా) నాదేళ్ల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది. ఉదయగిరి (M) గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళుతుండగా అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.