News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

Similar News

News April 13, 2026

ప్రభుత్వ రహస్య వ్యూహం.. ‘గ్రే వాటర్’ పైప్‌లైన్! (2)

image

నగరంలోని డేటా సెంటర్ల కోసం ఏటా 210 కోట్ల లీటర్ల నీరు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. తాగే నీటిని వీటికి మళ్లించడం వల్ల వచ్చే రాజకీయ వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి వెలువడే 1100 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి, నేరుగా ఈ సెంటర్ల కూలింగ్ వ్యవస్థలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల మూసీ కాలుష్యం తగ్గుతుందని <<19639510>>ప్రభుత్వం<<>> వాదిస్తోంది.

News April 13, 2026

HYD: సెంటర్లకు నీళ్లు.. సమ్మర్‌లో నీటి ఎద్దడి! (3)

image

సిటీలోని భారీ డేటా సెంటర్లు నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. ఒక్క 100 మెగావాట్ల డేటా సెంటర్ రోజుకు 20 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తోంది. HMWSSB నిబంధనల ప్రకారం 13,333 మంది ప్రజల దాహాన్ని తీర్చగలదు. 40పైగా డేటా సెంటర్ల వినియోగం వల్ల దాదాపు 5.3 లక్షల మందికి సరిపడా నీరు ఈ పరిశ్రమలకే మళ్లుతోంది. రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడానికి ఇదే కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

News April 13, 2026

ఆహా! సాయంత్రం వేళ HYDలో ఏక్ దమ్ కాంబినేషన్

image

మనోళ్లకు నచ్చితే దాన్ని ఎంతలా ఓన్ చేసుకుంటారో ఇరానీ చాయ్ చక్కటి నిదర్శనం. ఇది HYDలో ఓ అంతర్భాగం అయిపోయింది. 19వ శతాబ్దంలో పర్షియా నుంచి వలస వచ్చిన వారు ఈ రుచిని నగరానికి పరిచయం చేశారు. గంటల తరబడి మరిగే చిక్కటి పాలు, ఆవిరి బయటకు పోకుండా మరిగించే డికాషన్ కలిపి ఇచ్చే ఈ చాయ్‌ని పని ముగించుకొని ఇంటికి వెళ్తూ.. ఉస్మానియా బిస్కెట్‌తో కలిపి ఓ సిప్ వేస్తే స్ట్రెస్ అంతా స్వాహా! తలచుకుంటే నోట్లో నీళ్లూరతాయి.