News November 19, 2025
ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
Similar News
News April 8, 2026
ఇరాన్‌లో US పైలట్‌ను కనిపెట్టిన ‘ఘోస్ట్ మర్మర్’

ఇరాన్‌లో F-15E <<19570876>>పైలట్‌ను కాపాడటానికి<<>> US CIA ‘ఘోస్ట్ మర్మర్’ అనే టెక్నాలజీని వాడింది. ఇది కొన్ని KM దూరం నుంచి మనిషి గుండె చప్పుడును పసిగడుతుంది. మనిషి గుండె కొట్టుకున్నప్పుడు బాడీ నుంచి తక్కువ స్థాయిలో విద్యుదయస్కాంత కిరణాలు రిలీజ్ అవుతాయి. ‘క్వాంటం మాగ్నెటోమెట్రీ’ టెక్నాలజీని వాడే ‘ఘోస్ట్ మర్మర్’ ఆ వీక్ సిగ్నల్స్‌ను పసిగడుతుంది. AI సాయంతో చుట్టుపక్కల నాయిస్ నుంచి గుండె చప్పుడును వేరు చేస్తుంది.
News April 8, 2026
కడప జిల్లాలో రూ.29 కోట్ల విద్యుత్ బకాయిలు.!

కడప జిల్లాలో 4 విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 9,50,675 విద్యుత్ సర్వీసుల నుంచి రూ.29 కోట్ల బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా ఉన్న సర్వీసులు, బకాయిల వివరాలు.
☀ కడపలో 2,83,976 సర్వీసుల నుంచి రూ.10.11 కోట్లు
☀ మైదుకూరులో 2,26,892 సర్వీసుల నుంచి రూ.8 కోట్లు
☀ ప్రొద్దుటూరులో 3,01,810 సర్వీసుల నుంచి రూ.10.60 కోట్లు
☀ పులివెందుల్లో 1,37,997 సర్వీసుల నుంచి రూ.27.53 కోట్లు.
News April 8, 2026
కర్నూలు: ఈతకు వెళ్లి 8వ తరగతి విద్యార్థి గల్లంతు

కర్నూలు జిల్లా సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి తెలుగు మధు మంగళవారం చెరువు సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రంగమ్మ, మద్దిలేటి వెతకగా బావి వద్ద కుమారుని దుస్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న జాలర్లు బావిలో గాలించినా మధు ఆచూకీ లభించలేదు. కుమారుని పరిస్థితి తలచుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.


