News November 30, 2025
ఆన్‌లైన్‌లో సింహాచలం దర్శనం టికెట్స్

సింహాచలం వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్. దేవదాదాయ శాఖ సూచనల మేరకు దేవస్థానం వసతి గదులు, దర్శనాలు, ప్రత్యేక పూజలు, ఇతర సేవల బుకింగులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకోచ్చినట్లు ఈవో సుజాత ఆదివారం తెలిపారు. వీరికి ప్రత్యేక మార్గం ద్వారా దర్శనం, ప్రత్యేక లడ్డు ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకొవచ్చని చెప్పారు.
Similar News
News March 9, 2026
ఇండియాకు డిస్కౌంట్ ఆపేసిన రష్యా: రిపోర్ట్స్

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో రష్యా లాభపడుతోంది. ఇరాన్ యుద్ధానికి ముందు ఇండియా రిఫైనరీలకు (FEB 28) బ్యారెల్‌పై 13 డాలర్లు డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఇప్పుడు దాన్ని ఆపేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు బ్రెంట్ బ్యారెల్ ధరపై అదనంగా $4 నుంచి $5 ప్రీమియం వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో రష్యా కీలకంగా మారింది.
News March 9, 2026
NZB: జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడు: మహేశ్ కుమార్

జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన NZB ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు జర్నలిస్టుల ప్రధాన పాత్ర ఉందన్నారు. పత్రిక రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ విశ్వసనీయత కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్‌లకు ఉందన్నారు. జర్నలిస్ట్‌ల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు.
News March 9, 2026
ఇంటర్ పరీక్షలకు 859 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు. 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.


