News September 10, 2025
ఆన్‌లైన్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం: డీఐఈవో

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు చివరి అవకాశం కల్పించనున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31తో చివరి అవకాశం ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ పెండింగ్ ఉందన్నారు. దీంతో ఈనెల 11, 12న అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 11, 2025
గ్రేటర్ HYD వ్యాప్తంగా వర్షపాతం వివరాలు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. హస్తినాపురంలో 25 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 19.3, చంపాపేటలో 12.3, గన్ ఫౌండ్రీలో 7.8, బంజారాహిల్స్, ఉప్పల్‌లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు రోజులు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

చట్ట వ్యతిరేక శక్తులపై ఎస్పీ సీరియస్

పోలీసులపై దాడి చేసిన ఘటనను ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన తర్వాత జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 23 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 110 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి.