News March 19, 2025
ఆన్‌లైన్ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ASF ఎస్పీ

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు తమ వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.
Similar News
News July 9, 2025
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
News July 9, 2025
తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.