News November 19, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్‌ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News February 10, 2026
రేపే అసెంబ్లీ: బూచేపల్లి, తాటిపర్తి ఎంట్రీ ఇస్తారా..?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP MLAలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News February 10, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ర్యాంకింగ్‌లో “ఒంగోలు” టాప్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు (86%) అగ్రస్థానంలో నిలిచింది. కొండపి (84%), దర్శి (82%), అద్దంకి (81%), పర్చూరు (80%), చీరాల (79%) నియోజకవర్గాలు మెరుగైన ‘A’ గ్రేడ్ సాధించాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు 77 శాతానికి పైగా మార్కులు పొందగా.. సంతనూతలపాడు, యర్రగొండపాలెం 75 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
News February 10, 2026
ప్రకాశం: ‘సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి’

సొంత చెల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డ అన్నకు విజయవాడ పోక్సో కోర్టు సోమవారం ‘జీవిత ఖైదు’ విధించింది. ప్రకాశం(D) కొండపి(M) పెట్లూరుకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు సంతానం. భార్య విడిపోయి ఇద్దరు కూతుర్లతో కృష్ణా జిల్లాకు వెళ్లగా కొడుకు తండ్రి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో అమ్మవద్దకు వెళ్లొస్తానన్న కొడుకు పెద్దచెల్లి(17)పై లైంగిక దాడి చేశాడు. కుమార్తె గర్భిణీ కాగా తల్లి కేసు పెట్టడంతో నిన్న శిక్ష పడింది.


