News March 4, 2025

ఆన్‌లైన్ సేవలు అందించండి: కలెక్టర్

image

కలెక్టర్ లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలన్నారు. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ-పీఏసీలుగా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్‌లైన్ సేవలు అందించాలని ఆదేశించారు.  

Similar News

News November 12, 2025

పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

image

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

News November 12, 2025

నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

image

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి

News November 12, 2025

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.