News February 19, 2025
ఆపదలో ఉంటే చెప్పండి: అన్నమయ్య SP

ఆపదలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు డయల్ చేయాలని సూచించారు. పోలీసులకు సమస్యపై ఫిర్యాదు చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ వివరాలను అందించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 13, 2025
భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
News March 13, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్
News March 13, 2025
‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.