News July 1, 2024
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయాలి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. 18 ఏళ్ల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 22, 2026
ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.