News September 25, 2025
ఆపరేషన్ లంగ్స్-2.0కి బ్రేక్

దసరా పండగ దృష్ట్యా ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించారు. పండుగ తర్వాత డ్రైవ్ కొనసాగుతుందని, తొలగించిన చోట్ల మళ్లీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News September 27, 2025
విశాఖ: ‘స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలి’

విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని, డాక్టర్ల విద్యార్హతలు, సెంటర్ డాక్యుమెంట్స్ పరిశీంచాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆ వివరాలు జిల్లా వైద్య అధికారికి అందజేయాలన్నారు.
News September 26, 2025
జీఎస్టీ లబ్ధికి అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్: విశాఖ కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించి, జీఎస్టీ లబ్ధిని ప్రజలకు చేరవేస్తామని వివరించారు.
News September 26, 2025
ఏయూలో మెడికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూలు

ఏయూలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన తాత్కాలిక నియామకాలకు పరిపాలన భవనంలో శుక్రవారం ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 10 మందికి పైగా హాజరయ్యారు. శనివారం కూడా ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుంది. ఏయూ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ విధానంలో వీరిని నియమిస్తున్నారు.