News December 16, 2025

ఆపరేషన్ సిందూర్‌ ఫస్ట్‌డేనే భారత్ ఓడింది: మహారాష్ట్ర Ex-CM

image

‘ఆపరేషన్ సిందూర్’లో మొదటిరోజే భారత్ ఓడిందని MH Ex-CM, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అంగీకరించినా లేకున్నా భారత ఎయిర్ క్రాఫ్ట్‌లు మొదటిరోజు దాడి చేయలేదన్నారు. ‘గ్వాలియర్, బఠిండా, సిర్సా నుంచి ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్‌లను పాక్ కూల్చేసే ప్రమాదం ఉండడంతో దాడి చేయలేదు. భవిష్యత్తులోనూ వైమానిక, క్షిపణి యుద్ధాలే జరుగుతాయి. 12 లక్షల మంది సైనికులు అవసరమా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 18, 2025

భారీ జీతంతో NCRTCలో ఉద్యోగాలు

image

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) 5 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, మేనేజ్‌మెంట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. Dy.GMకు పేస్కేల్ రూ.70వేలు-రూ.2లక్షలు, Asst.మేనేజర్‌కు రూ.50,000 -రూ.1,60,000 ఉంది. వెబ్‌సైట్: www.ncrtc.co.in

News December 18, 2025

బీర సాగులో మంచి ఆదాయానికి సూచనలు

image

బీరపంట సాధారణంగా విత్తిన 45 రోజులకు కోతకు వస్తుంది. బీరను నేల మీద కాకుండా పందిరి, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ రోజుల పాటు అధిక దిగుబడి వస్తుంది. చీడపీడలు తగ్గి, కాయ నాణ్యత బాగుంటుంది. కోతకు వచ్చిన కాయలను రోజు తప్పించి రోజు కట్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే కాయ లావుగా మారి ధర తగ్గే ఛాన్సుంది. ఉదయమే తెంపి మార్కెట్‌కు తీసుకెళ్తే అవి మరింత తాజాగా కనిపించి ఎక్కువ ధర వస్తుంది.

News December 18, 2025

హీరోయిన్‌కు చేదు అనుభవం.. కేసు నమోదు

image

నిన్న హైదరాబాద్‌లోని KPHB లులూ మాల్‌లో ‘రాజా సాబ్’ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు <<18602526>>అనుభవం<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అభిమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నిర్వహణ లోపంపై మాల్, ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు సెల్ఫీలకు పోటెత్తడంతో నిధి అసౌకర్యానికి గురయ్యారు.