News February 1, 2025
ఆపరేషన్ స్మెల్.. 122 మంది పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మెల్ -11 నిర్వహించి 122 మంది పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బడి మానేసినా, వివిధ దుకాణాలు, కర్మాగారాలు, ఇటుక భట్టిల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి, రెస్క్యూ చేసి వారికి, వారి తల్లితండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్: జగ్గారెడ్డి
సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మారాడని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి హైదరాబాదులోని గాంధీభవన్లో ఖండించారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది కేసీఆరేనని విమర్శించారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్‌ను కేసీఆర్ నాశనం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.
News February 1, 2025
KCR రైతు బంధు ఇవ్వలేదని బద్నాం చేయడం తగదు: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆనాడు PCC చీఫ్ రేవంత్ రెడ్డి ఉండి రైతు బంధును ఆపి, నేడు CM హోదాలో ఉండి KCR రైతుబంధు ఇవ్వలేదని బద్నాం చేస్తున్నారన్నారు. 2 రోజుల్లో రైతుల అకౌంట్లో రైతుబంధు డబ్బులు పడతాయని నవంబర్ 25, 2023 పాలకుర్తి పబ్లిక్ మీటింగ్‌లో నేను చెబితే, మరుసటి రోజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపలేదా ? అని ప్రశ్నించారు.
News January 31, 2025
రేపటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్
మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 1నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.