News April 2, 2026

ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

image

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.

Similar News

News April 14, 2026

ప్లీజ్.. పిల్లల ముందు గొడవలొద్దు!

image

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం గొడవ పడొద్దు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల మనసును బాధిస్తుంది. మరికొందరు నైబర్స్‌తో ఘర్షణకు దిగుతారు. అలాంటి సందర్భాల్లోనూ పిల్లలు భయానికి గురవుతారు. ఇది వారిలో అభద్రతాభావానికి దారి తీస్తుంది. భవిష్యత్తులో వారూ చెడు మాటలు మాట్లాడటం, పెరిగి పెద్దయ్యే క్రమంలో గొడవలకు దిగే ప్రమాదం ఉంటుంది.

News April 14, 2026

నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

image

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.

News April 14, 2026

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.