News December 26, 2025
ఆఫీసు కుర్చీలో నిద్రపోవడం అశుభమా?

ఆఫీసు కుర్చీని సింహాసనంలా భావించాలని పండితులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఆ కుర్చీపై నిద్రించడం తగదంటున్నారు. ‘ఇది వృత్తి పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలు, అశుభ ఫలితాలను కలిగించే అవకాశముంది. ఇది ప్రగతిని అడ్డుకుని ప్రతికూల శక్తిని పెంచవచ్చు. మీకు అలసటగా ఉంటే నడవడం, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవడం చేయాలి. కుర్చీలో నిద్రించడం కెరీర్‌కు మంచిది కాదు’ అంటున్నారు.
Similar News
News February 17, 2026
రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 17, 2026
హీరో తండ్రి కన్నుమూత

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.
News February 17, 2026
AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.


