News March 30, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News December 21, 2025
SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
News December 21, 2025
శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.
News December 21, 2025
శ్రీకాకుళం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. పోలాకి మండలంలో MLA బగ్గు రమణమూర్తి ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు.


