News March 26, 2024
ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
Similar News
News September 8, 2025
SKLM: కుల బహిష్కరణ చేశారంటూ వ్యక్తి ఆవేదన

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. మెళియాపుట్టి(M) జాడుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అనంతరం గ్రామంలో జీవనం సాగిస్తుండగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్థానికులు ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు.
News September 8, 2025
శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీహెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.
News September 8, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు