News February 23, 2025

ఆమదాలవలస : వెలవెలబోతున్న చికెన్ షాపులు

image

జిల్లాలోని బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ షాపులు వెల వెల పోతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్ వినియోగం తగ్గడం వలన ఆమదాలవలసలో కేజీ స్కిన్ లెస్ రూ .150/- గా ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ లేకపోయినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2026

పొందూరు: చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పొందూరు మండలం లోలుగుకు చెందిన నీలప్పడు కొబ్బరి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు జారి పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొబ్బరి బొండాలు దించే ప్రయత్నంలో బుధవారం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కుటుంబీకులు ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News February 19, 2026

శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 19, 2026

శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

image

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్‌కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.