News January 20, 2026

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

Similar News

News February 19, 2026

ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని CSIR-IICT 16పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MTech, మెటీరియల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), BTech/BE, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లు. సైట్: www.iict.res.in

News February 19, 2026

BREAKING: రాష్ట్రంలో భూకంపం

image

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

News February 19, 2026

కాపర్ టీ వాడుతున్నారా?

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్‌ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.