News January 14, 2026

ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు

image

పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.

Similar News

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 18, 2026

మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

image

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్‌, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.

News February 18, 2026

25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

image

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<>GD<<>>) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23న పరీక్ష జరగాల్సి ఉండగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 8/10రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 2/3రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/