News December 21, 2025

ఆయన ఫెయిలై.. మమ్మల్ని నిందిస్తారేంటి: ఖర్గే

image

అస్సాం విషయంలో PM మోదీ చేసిన <<18631472>>ఆరోపణలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ‘కేంద్రం, అస్సాంలో ఆయన ప్రభుత్వమే ఉంది. ప్రజలను రక్షించడంలో వాళ్లు విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మేం అక్కడ పాలిస్తున్నామా? ఆయన ఫెయిలై.. ప్రతిపక్షంపై తోస్తారు. వాళ్లే విధ్వంసకారులు. మేం కాదు. టెర్రరిస్టులనో, చొరబాటుదారులనో మేం సపోర్ట్ చేయడం లేదు. ప్రజలను కాపాడటంలో విఫలమై మాపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News December 24, 2025

KMR: సైబర్ బాధితులకు రూ.1.07 కోట్లు వాపస్!

image

కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలో 200 సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 160కి తగ్గింది. ముఖ్యంగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్, కోర్టు ఉత్తర్వుల ద్వారా రూ.1,07,31,518 విలువైన సొత్తును తిరిగి ఇప్పించడం విశేషం. 2024లో 35 NDPS కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 23కి తగ్గింది. నిరంతర నిఘా, కఠిన తనిఖీలు చేపట్టడం ద్వారా జిల్లాలో గంజాయి సరఫరాను అడ్డుకోగలిగారు.

News December 24, 2025

‘భారత్ నీళ్లు ఆపేస్తోంది’.. పాక్ ఆరోపణల్లో నిజమెంత?

image

వాతావరణ పరిస్థితులు, మంచు కరగడం, డ్యామ్ కార్యకలాపాలు సహా పలు అంశాలపై నీటి ప్రవాహ వేగం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటిని నిలిపేసి, ఒకేసారి విడుదల చేస్తూ IND ఇబ్బంది <<18651568>>పెడుతోందని<<>> PAK చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్ ఒప్పందాన్ని IND రద్దు చేసింది. దీంతో తాము నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని PAK అంటోంది.

News December 24, 2025

ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈక్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.