News April 9, 2024

ఆయన ముఖం కూడా చూపించలేడు : రూప్ కుమార్

image

చెల్లెలు వరుసైన కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డిపై నీచమైన రాజకీయాలు చేస్తున్న ప్రసన్న సోదరులను చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రసన్న సోదరుడు రాజేంద్రకు సంబంధించి అనేక ఆడియోలు ఉన్నాయని.. వాటిని బయటపెడితే ఆయన ఆసలు బయట ముఖం కూడా చూపించలేడని విమర్శలు గుప్పించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

Similar News

News March 18, 2025

వరికుంటపాడు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌తో అనుచిత ప్రవర్తన

image

వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో BPM గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాకు సంబంధించిన మొత్తంలో తేడా ఉందని అతడు అనుచితంగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2025

నెల్లూరు యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి

image

నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సమీపంలో ఓ యువకుడిపై ఇద్దరు యువకులు విచక్షణారహితంగా బీరు బాటిళ్లతో దాడి చేశారు. డైకస్ రోడ్డులో వెళ్తున్న వెంగళరావు నగర్‌కు చెందిన షారుక్‌ను ఆటోలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు అడ్డగించి పలకరించలేదని దౌర్జన్యంతో బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన షారుక్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 18, 2025

వరికుంటపాడులో 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

image

వరికుంటపాడులో 84 ఏళ్ల వృద్ధురాలిపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరికుంటపాడు ప్రధాన రహదారి వెంబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!