News December 31, 2025

ఆయిల్‌పామ్ సాగు, మొక్కల ఎంపికలో జాగ్రత్తలు

image

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు) నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News December 31, 2025

ఖలీదా జియాకు సంతాపం.. మోదీ లేఖతో ఢాకా వెళ్లిన జైశంకర్

image

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం పట్ల సంతాపం తెలిపేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢాకా వెళ్లారు. ఆమె కుమారుడు, BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్‌ను కలిసి ప్రధాని మోదీ పంపిన లేఖను అందించారు. భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖలీదా ఆశయాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆకాంక్షించారు. 2026లో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

News December 31, 2025

విచారణలో పోలీసులకే iBOMMA రవి ప్రశ్నలు

image

12 రోజుల విచారణలో పోలీసులకూ iBOMMA రవి పలు ప్రశ్నలు వేశాడని సమాచారం. తానే iBOMMA సైట్ రన్ చేస్తున్నట్లు ప్రూఫ్ ఏంటి? అని రవి ప్రశ్నించాడట. అటు అరెస్టుకు ముందూ ఈ తరహా స్పందన ఎదురైందట. VR ఇన్ఫోటెక్ పేరిట iBOMMA, బప్పంtv సైట్స్ రిజిస్టర్ అయ్యాయని తెలిసి పోలీసులు మెయిల్ చేశారు. దీంతో ‘వాటికి సర్వీస్ ఇస్తున్నానంతే, అందులో పైరసీ మూవీస్ లేవు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పంపండి’ కౌంటర్ క్వశ్చన్ చేశాడట.

News December 31, 2025

ఇంటి చిట్కాలు మీ కోసం..

image

* చెక్క కుర్చీలు జరిపేటప్పుడు వాటి కాళ్ళకు సాక్సులు వేస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
* కత్తెర, చాకు తుప్పు పడితే వాటిని బ్లాక్ టీలో ఉంచి రెండు మూడు గంటలయ్యాక తీసి పొడి వస్త్రంతో శుభ్రపరచండి.
* ఇంటికి పెయింట్ వేసే ముందు అద్దాలను కిరోసిన్ తో తుడిస్తే మరకలు పడినా సులభంగా వదులుతాయి.
* గాజు గ్లాసులు, సీసాలను మెత్తని ఉప్పుతో శుభ్రపరిస్తే గీతలు పడకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.