News April 2, 2025
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.21,000కు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ధర రూ. 8,500 మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ధర పెరగడంతో రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని, ఇంకా మరింతమంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 3, 2025
ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.
News April 3, 2025
ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News April 3, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన