News February 14, 2025

ఆయిల్ ఫామ్ సాగు రైతులకు డ్రిప్ సౌకర్యం కల్పించండి: కలెక్టర్

image

ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటున్న రైతులను ప్రోత్సహిస్తూ డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయిల్ ఫామ్ సాగు, పండ్ల తోటలు విస్తరణ, డ్రిప్ సౌకర్యం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 27, 2026

ప్రాధాన్యత పనులపై ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాధాన్యత పనులపై సమీక్షించి, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆర్&బీ, ఇరిగేషన్, తుడా, మున్సిపల్ కార్పొరేషన్ శాఖలకు చెందిన ప్రాధాన్యత పనుల వివరాలను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. దీర్ఘకాలిక అంశాలపై పూర్తి నివేదికలు ప్రభుత్వానికి పంపాలని స్పష్టం చేశారు.

News February 27, 2026

బాల్య వివాహాలను అరికడదాం: ఎంపీ రఘునందన్

image

సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన రథాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

News February 27, 2026

అనకాపల్లి: 310 విద్యార్థుల గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.