News November 27, 2025

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

image

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పౌరసరఫరాల అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, గోనెసంచులు తదితర అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

హైదరాబాద్‌లో మరో మెగా GCC?

image

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మియామిన్ కార్ప్ సంస్థ ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ(బోయింగ్ లేదా ఎమిరేట్స్) కోసం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ GCCని నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా 1,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.

News November 27, 2025

భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.