News August 10, 2025

ఆరాంఘర్‌లో RTC టెర్మినల్ ఇక డౌటే!

image

వేలాదిబస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దీంతో ఆర్టీసీ టెర్మినల్ నిర్మించాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అక్కడి ప్రభుత్వ స్థలాన్ని పోలీసుశాఖకు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీసుశాఖ ఆధీనంలోని గోషామహల్ మైదానం ఉస్మానియా ఆస్పత్రికి కేటాయించడంతో ఆరాంఘర్ స్థలం ఆ శాఖకు ఇవ్వాలని నిర్ణయించడంతో బస్ టెర్మినల్‌కు బ్రేక్ పడినట్టేనని తెలుస్తోంది.

Similar News

News September 14, 2025

చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

image

గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.

News September 14, 2025

రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

image

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.

News September 14, 2025

HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

image

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.