News December 26, 2025
‘ఆరావళి’కి తూట్లు.. ఏడేళ్లలో 4 వేల అక్రమ మైనింగ్ కేసులు!

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ అంశం తీవ్ర <<18663286>>వివాదానికి<<>> దారి తీసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో ఆరావళి పర్వతాలు విస్తరించిన జిల్లాల్లో 4,181 అక్రమ మైనింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లలో మొత్తం 7,173 FIRలు రిజిస్టర్ చేసినట్లు తేలింది. రాష్ట్రంలో 71 వేల ఇల్లీగల్ మైనింగ్ ఘటనలు జరిగితే అందులో ఆరావళి జిల్లాల్లోనే 40 వేలు ఉండటం గమనార్హం.
Similar News
News December 26, 2025
SM వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

16 ఏళ్లలోపు పిల్లలకు SM వాడకాన్ని బ్యాన్ చేసేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్ యాక్సెస్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పేరెంటల్ కంట్రోల్స్ అందుబాటులోకి తెచ్చేలా ISPలను ఆదేశించాలని TN మధురై జిల్లాకు చెందిన ఎస్.విజయ్ కుమార్ PIL వేశారు. దానిపై విచారించిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ పై వ్యాఖ్యలు చేశారు.
News December 26, 2025
వంటింటి చిట్కాలు మీ కోసం

* కొబ్బరి చట్నీ చేసేటపుడు అందులో నీళ్ళకు బదులు పాలు పోస్తే మరింత రుచిగా ఉంటుంది.
*బెండకాయముక్కలను ఉప్పుతో కడిగితే కూర జిగురు రాదు.
* గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బు నీళ్ళలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.
* టమాటా సూప్ కు మంచి రంగు రావాలంటే అందులో బీట్ రూట్ ముక్క వేయాలి.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
News December 26, 2025
బీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.90.50 కోట్లు మంజూరు

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల కోసం రూ.90.50 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ రెండో విడతకు రూ.69.40Cr, ప్రీ మెట్రిక్ రెండో విడతకు రూ.21.10Cr స్కాలర్‌షిప్ ఫండ్స్ కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.


