News December 24, 2025

ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈక్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.

Similar News

News February 21, 2026

బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.

News February 21, 2026

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 4 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 27 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MA(సోషల్ వర్క్, ఉమెన్స్ స్టడీస్/డెవలప్‌మెంట్ స్టడీస్), డిగ్రీ అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.1,50,000, రీసెర్చ్ ఆఫీసర్‌కు రూ.50K, అడ్మినిస్ట్రేటివ్ కమ్ అకౌంట్స్ ఆఫీసర్‌కు రూ.40Kచెల్లిస్తారు. వెబ్‌సైట్: https://tiss.ac.in/

News February 21, 2026

రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

image

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నటి మీనా తెలిపారు. ‘నా సెకండ్ మ్యారేజ్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. రూమర్స్ స్ప్రెడ్ చేసే వారు నాకు టీనేజ్ కూతురు ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధగా ఉంటుంది, కోపం వస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీనా భర్త విద్యాసాగర్ 2022లో మరణించారు. ప్రస్తుతం ఆమె మోహన్‌లాల్‌తో ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు.