News November 10, 2025
ఆరికకు చిత్త గండం, ఆడదానికి పిల్ల గండం

ఆరిక(ఒక రకమైన చిరుధాన్యం) పండాలంటే, అవి పక్వానికి వచ్చే సమయంలో చిత్తా నక్షత్రం ప్రవేశంలో వర్షాలు బాగా కురవాలి. అప్పుడు వర్షాలు లేకుంటే పంట నాశనమవుతుంది. అందుకే ఆరిక పంటకు ఆ సమయం గండం వంటిది. అలాగే ఒక స్త్రీ జీవితంలో ప్రసవం అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన ఘట్టం. దానినే పిల్ల గండంగా పేర్కొన్నారు. జీవితంలో కొన్ని దశలలో కొన్ని విషయాలకు సహజంగానే పెద్ద సవాళ్లు ఎదురవుతాయని ఈ సామెత తెలియజేస్తుంది.
Similar News
News November 10, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీలో 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్‌తో పాటు NCVT సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. COPA 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 11 ఉన్నాయి. NATS పోర్టల్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్:https://mumbaiport.gov.in/
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ.వందల కోట్ల ఖర్చు!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు ఇస్తున్నాయని టాక్. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. అందులో కనీసం 3 లక్షల మందికి రూ.2500 చొప్పున పంపిణీ చేసినా రూ.75Cr ఖర్చవుతుంది. ఇక ప్రచారానికి జన సమీకరణ, యాడ్స్‌కు అదనం. దీంతో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రేపు పోలింగ్ జరగనుంది.
News November 10, 2025
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకల కట్టడి ముఖ్యం. లేకుంటే ఇవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.


