News October 30, 2025

ఆరుట్ల బుగ్గజాతరకు ఇలా వెళ్లండి

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆరుట్ల <<18145591>>బుగ్గరామలింగేశ్వర స్వామి<<>> జాతర NOV 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ సన్నిధిలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రకృతి అద్భుతం. ఇక్కడికి ఎల్బీనగర్, పెద్దఅంబర్‌పేట్ నుంచి వెళ్లొచ్చు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లాలి. అక్కడి నుంచి ఆరుట్ల, బుగ్గతండాకు బస్సులు, ఆటోలుంటాయి. స్వయానా రామయ్యే ప్రతిష్ఠించడం, బుగ్గతండాలో ఉండటంతో బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు.

Similar News

News November 1, 2025

అంతర్గాం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

image

రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్‌ స్టేషన్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీశారు.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2025

నంద్యాల జిల్లాలో 93.63% పంపిణీ

image

నంద్యాల జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు(శనివారం) పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 2,14,571 మందికి గానూ 2,00,899 మందికి(93.63%) పింఛన్లు పంపిణీ చేశారు.