News February 26, 2026
ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.
Similar News
News February 27, 2026
కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్

TG: మద్యం కుంభకోణం కేసులో కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం BRS. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుంది. కుట్రపూరిత కేసులను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News February 27, 2026
వాట్సాప్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయా?

వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై ‘స్టేటస్’ విభాగంలో యాడ్స్, ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌లో ప్రమోటెడ్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. దీనివల్ల యూజర్‌కు అవసరమైన వ్యాపార సంస్థలతో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఈ మార్పుల వల్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి సురక్షితంగా ఉంటాయని తెలిపింది.
News February 27, 2026
2018 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్లకు ఎదురుదెబ్బ

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన <<19238436>>ఉత్తర్వులను<<>> సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగం చేయలేరా? ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది. సంతృప్తిగా ఉండండి’ అని పేర్కొంది.


