News December 19, 2025

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన

image

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్ యాదవ్ రెండు రోజుల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన ఈనెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు అన్నవరం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ అన్నవరం నుంచి కాకినాడ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు అన్నవరంలో బయల్దేరి కాకినాడ విచ్చేస్తారు. కాకినాడలో జరిగే వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ, పల్స్ పొలియోలో పాల్గొంటారని జిల్లా సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News December 20, 2025

పెరవలిలో జలధార స్కీమ్‌కు పవన్ నేడు శంకుస్థాపన

image

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ పనులకు శనివారం పెరవలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోనసీమ, కాకినాడ, ఏలూరు సహా 23 నియోజకవర్గాల్లోని 68 లక్షల మందికి తాగునీరు సరఫరా కానుంది. పశ్చిమ గోదావరికి రూ. 1,400 కోట్లు, తూర్పు గోదావరికి రూ.1,650 కోట్లు కేటాయించి ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్వహిస్తోంది.

News December 20, 2025

కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.

News December 20, 2025

స్వామికి కావాలసింది నిర్మలమైన భక్తి మార్గమే..

image

శ్రీనివాసుడికి అన్నమయ్య సంకీర్తనలంటే ఎంత ఇష్టమో కురువరనంబి మట్టి పూల పూజ కూడా అంతే ఇష్టం. అలాగే ముస్లిం రాకుమారి బీబీ నాంచారిని మన్నించి తన హృదయంలో స్థానమిచ్చారు. మత సామరస్యాన్ని చాటారు. భగవంతుడి దృష్టిలో కులమతాలు, పేద ధనిక భేదాలు లేవు. ఆయన ఆశించేది ఆడంబరమైన పూజలు కాదు. కేవలం నిర్మలమైన భక్తిని మాత్రమే. మనం కూడా సాటి మనుషులను సమానంగా గౌరవించాలి. హృదయం శుద్ధిగా ఉంటేనే మనం చేసే పనికి విలువ ఉంటుంది.